Karnataka BJP chief : యెడియూరప్ప తనయుడికి కర్ణాటక బీజేపీ పగ్గాలు

భారతీయ జనతా పార్టీ కర్ణాటక యూనిట్ కొత్త చీఫ్‌గా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన అనంతరం బీజేపీ రాష్ట్ర పగ్గాలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తనయుడు విజయేంద్రకు అప్పగించింది....

Karnataka BJP chief : యెడియూరప్ప తనయుడికి కర్ణాటక బీజేపీ పగ్గాలు

Yediyurappa’s son Vijayendra

Updated On : November 11, 2023 / 6:00 AM IST

Karnataka BJP chief : భారతీయ జనతా పార్టీ కర్ణాటక యూనిట్ కొత్త చీఫ్‌గా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన అనంతరం బీజేపీ రాష్ట్ర పగ్గాలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తనయుడు విజయేంద్రకు అప్పగించింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కటీల్ స్థానంలో యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర కర్ణాటక బీజేపీకి కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు.

ALSO READ : Deepavali : దీపావళి సందర్భంగా క్రాకర్‌ టైమ్‌ ఇదే…బాంబే హైకోర్టు సంచలన ఆదేశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్రను తక్షణమే అమలులోకి వచ్చేలా కొత్త రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కర్ణాటక రాష్ట్ర చీఫ్‌గా అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లకు విజయేంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ : Chanti Kranthi Kiran : ఆ రూ.200 కోట్లు ఇస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా- ఎమ్మెల్యే క్రాంతి సంచలన ప్రకటన

‘‘బీజేపీ నాయకులు అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి, వారి నమ్మకాన్ని గెలుచుకోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి నన్ను ఆశీర్వదించండి’’అని విజయేంద్ర యెడియూరప్ప కోరారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటక నుంచి అత్యధిక సీట్లు సాధించి, ప్రధాని మోదీ బ్రాండ్‌ను, ప్రతిష్ఠను బలోపేతం చేయడం ద్వారా పార్టీ విజయానికి కృషి చేస్తాం’’ అని బీవై విజయేంద్ర అన్నారు.

ALSO READ : Janhvi Kapoor Kushi Kapoor : అక్కాచెల్లెళ్లు లంగాఓణిలో.. దీపావళి స్పెషల్ జాన్వీ కపూర్, ఖుషి కపూర్ స్పెషల్ ఫొటోస్..

రాష్ట్ర చీఫ్‌ పదవి కోసం సీటీ రవి, సునీల్‌కుమార్‌, బసనగౌడ పాటిల్‌ పోటీ పడినా విజయేంద్ర కే బీజేపీ కేంద్ర అధిష్ఠానం అప్పగించింది. విజయేంద్ర రాష్ట్ర అసెంబ్లీలో శివమొగ్గలోని షికారిపుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన విజయేంద్రకు అతని తండ్రి, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప మిఠాయి తినిపించి ఆశీర్వదించారు.