IBPS Clerk Notification: ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్.. 10277 ఖాళీలు, రూ.24 వేల జీతం.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు
IBPS Clerk Notification: ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టు కోసం IBPS క్లర్క్ పరీక్షను నిర్వహించనుంది.

IBPS has released a notification for the recruitment of 10277 Clerk posts.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టు కోసం IBPS క్లర్క్ పరీక్షను నిర్వహించనుంది. ఈమేరకు అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11 పీఎస్బీలలో మొత్తం 10277 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనిని సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగనుంది. కాబట్టి, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.ibps.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు, వివరాలు:
- ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21 వరకు దరఖాస్తులు
- ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సెప్టెంబర్ లో ఉంటుంది
- అడ్మిట్ కార్డ్స్ సెప్టెంబర్ లో ఉంటుంది
- అక్టోబర్ 4, 5, 11వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది
- నవంబర్ 29న మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది.
- మార్చ్ 2026లో ప్రొవిజనల్ ఎలాట్మెంట్ ఉండే అవకాశం ఉంది.
విద్యార్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)/ కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సమానమైన అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయసు 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ మధ్యలో ఉండాలి. కేటగిరీ వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్థులు రూ.850, SC/ST/PWD అభ్యర్థులు రూ.175 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, భాషా నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,050 జీతం ఇస్తారు.