IBPS SO Admit Card 2024 : ఐబీపీఎస్ ఎస్ఓ అడ్మిట్ కార్డు విడుదల.. ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి!
IBPS SO Admit Card 2024 : ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐబీపీఎస్ ఎస్ఓ అడ్మిట్ కార్డ్ 2024ని అధికారిక వెబ్‌సైట్ (ibps.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

IBPS SO Admit Card 2024 Released
IBPS SO Admit Card 2024 : ప్రముఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు వారి ఐబీపీఎస్ ఎస్ఓ అడ్మిట్ కార్డ్ 2024ని అధికారిక వెబ్‌సైట్ (ibps.in) నుంచి లేదా ఈ కింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఐబీపీఎస్ ఎస్ఓ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ చేయాలంటే? :
- అధికారిక ఐబీపీఎస్ వెబ్‌సైట్ (ibps.in)ని విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో “CRP-SPL-XIV కోసం ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్” లింక్‌పై క్లిక్ చేయండి
- కొత్త పేజీలో మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి
- సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి.
- మీ ఐబీపీఎస్ ఎస్ఓ అడ్మిట్ కార్డ్ 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఇప్పుడు అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.
ఐబీపీఎస్ ఎస్ఓ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్ :
ఐబీపీఎస్ అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డ్‌లు నవంబర్ 9, 2024 వరకు డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంటాయని గమనించాలి. ఐబీపీఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ పరీక్ష 2024 నవంబర్ 9, 2024న జరగాల్సి ఉంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను వ్యాలీడ్ అయ్యే ఫొటో ఐడీ ప్రూఫ్‌తో పాటు ( ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైనవి) పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. ఐబీపీఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ పరీక్ష 2 గంటల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష పేపర్‌లో 150 మల్టీ-ఆప్షనల్ ప్రశ్నలు (MCQ) ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షకు అర్హత ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అనుమతిస్తారు.
ఐబీపీఎస్ ఎస్ఓ 2024 ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థులు ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) పోస్టులకు రెండు అంచెల పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత
ఇంటర్వ్యూ ఉంటుంది.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నెక్స్ట్ లెవల్ షార్ట్‌లిస్ట్ అయ్యే అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాలి.
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష : ప్రిలిమినరీ పరీక్ష నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్ మెయిన్ పరీక్షకు చేరుకుంటారు.
కామన్ ఇంటర్వ్యూ : ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో అర్హత సాధించిన వారు పాల్గొనే బ్యాంకులు, నోడల్ బ్యాంక్ సమన్వయంతో నిర్వహించే కామన్ ఇంటర్వ్యూకి అనుమతిస్తారు.
Read Also : Google Pixel Phones : ఆపిల్ ఐఫోన్ 16పై నిషేధం తర్వాత గూగుల్ పిక్సెల్ ఫోన్లు బ్లాక్ చేసిన ఇండోనేషియా!