ICAI CA Final 2024 Result : ఈ నెల 26న ఐసీఏఐ సీఏ ఫైనల్ నవంబర్ 2024 రిజల్ట్స్ విడుదల.. పూర్తి వివరాలివే!
ICAI CA Final 2024 Result : పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రోల్ నంబర్లు, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఫైనల్, పోస్ట్-క్వాలిఫికేషన్ కోర్సుల రిజల్ట్స్ చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ICAI CA Final 2024 Result
ICAI CA Final 2024 Result : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఫైనల్ నవంబర్ 2024 పరీక్ష ఫలితాలను డిసెంబర్ 26న ప్రకటించనుంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ (icai.org)లో చెక్ చేసుకోవచ్చు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రోల్ నంబర్లు, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఫైనల్, పోస్ట్-క్వాలిఫికేషన్ కోర్సుల రిజల్ట్స్ చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్ రిజల్ట్స్‌తో పాటు మెరిట్ లిస్టును కూడా విడుదల చేస్తుంది.
ఫైనల్ కోర్సులతో పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సుల ఫలితాలను కూడా ప్రకటిస్తారు. ఇందులో ఇంటర్నేషనల్ టాక్సేషన్ అసెస్‌మెంట్ టెస్ట్, ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి. ఐసీఏఐ సీఏ ఫైనల్ గ్రూప్ I పరీక్షలు నవంబర్ 3, 5, 7 తేదీల్లో నిర్వహించనున్నారు.
గ్రూప్ II పరీక్షలు నవంబర్ 9, 11, 13 తేదీల్లో జరిగాయి. ఐసీఏఐ సీఏ నవంబర్ ఫైనల్ పరీక్షకు అర్హత పొందడానికి అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం ప్రతి విభాగంలో 40 శాతం మార్కులు, మొత్తం 50 శాతం మార్కులు ఉంటాయి.
“ఐసీఏఐ ఫైనల్ రిజల్ట్స్ డిసెంబర్ చివరి వారంలో 26వ తేదీ సాయంత్రంలోపు వెలువడే అవకాశం ఉంది” అని సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు (CCM) ధీరజ్ ఖండేల్‌వాల్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. ఐసీఏఐ సీఏ నవంబర్ ఫైనల్ రిజల్ట్స్ 2024 : స్కోర్‌కార్డ్‌ని చెక్ చేసేందుకు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ (icai.org)ని విజిట్ చేయండి.
హోమ్‌పేజీలో ఐసీఏఐ సీఏ నవంబర్ ఫైనల్ రిజల్ట్స్ 2024 లింక్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ నంబర్, రోల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- రిజల్ట్ స్ర్కీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఐసీఏఐ జనవరి 2025 పరీక్ష షెడ్యూల్ విడుదల :
ఐసీఏఐ జనవరి 2025 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫౌండేషన్ కోర్సు పరీక్షలు జనవరి 12 నుంచి జనవరి 18 వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు గ్రూప్ I కోసం జనవరి 11 నుంచి జనవరి 15 మధ్య గ్రూప్ II కోసం జనవరి 17 నుంచి జనవరి 21 మధ్య పరీక్షలను నిర్వహించనున్నారు.
Read Also : CTET Answer Key 2024 : సీటెట్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ 2024 విడుదల.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే? ఫుల్ ప్రాసెస్!