CTET Answer Key 2024 : సీటెట్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ 2024 విడుదల.. ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే? ఫుల్ ప్రాసెస్!
CTET Answer Key 2024 : అభ్యర్థులు సీటెట్ డిసెంబర్ పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీని (ctet.nic.in) నుంచి చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ చేసేందుకు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ అవసరం తప్పక ఉండాలి.

CTET Answer Key 2024
CTET Answer Key 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిసెంబర్ 14న సీటెట్ పరీక్షను నిర్వహించింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీ, అభ్యర్థుల రెస్పాన్స్ త్వరలో (ctet.nic.in)లో అందుబాటులో ఉంటాయి. సీటెట్ పేపర్ II ఉదయం 9:30 నుంచి 12:00 గంటల వరకు నిర్వహించారు. అలాగే, పేపర్ I మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు జరిగింది.
సీటెట్ ఆన్సర్ కీని ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి? :
అభ్యర్థులు సీటెట్ డిసెంబర్ పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీని (ctet.nic.in) నుంచి చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లాగిన్ చేసేందుకు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ అవసరం తప్పక ఉండాలి.
సీటెట్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
- అభ్యర్థులు ఈ కింది విధంగా ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్‌సైట్ (ctet.nic.in)ను విజిట్ చేయండి.
- “Candidate Activity” సెక్షన్‌లో ప్రొవిజనల్ ఆన్సర్ కీ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ చేసేందుకు మీ రోల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
- సీటెట్ ఆన్సర్ కీ డిస్‌ప్లే అవుతుంది.
- ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.
సీటెట్ 2024 పరీక్ష వివరాలివే :
డిసెంబర్ పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైన తర్వాత అభ్యర్థులు చెక్ చేయవచ్చు. అవసరమైతే అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఒక్కో ఛాలెంజ్‌కు రూ. వెయ్యి రుసుము వసూలు చేస్తారు.
ఈ అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలిస్తుంది. ఆన్సర్ కీలో ఏదైనా పొరపాటు ఉంటే.. అవసరమైన దిద్దుబాట్లు చేయాలి. రుసుము తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన తర్వాత బోర్డు ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తుంది. దీని ఆధారంగా సీటెట్ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తుంది. అభ్యర్థులు తమ స్కోర్‌లను అంచనా కోసం సీటెట్ ఆన్సర్ కీ, ఓఎమ్ఆర్ షీట్‌ను ఉపయోగించవచ్చు.
Read Also : CBSE CTET Answer Key 2024 : సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీ 2024 త్వరలో విడుదల.. డేట్, టైమ్ అప్‌టేట్ వివరాలివే!