Actor Venkatesh: నటుడు వెంకటేశ్ ఇంట్లో విషాదం.. నిన్ను చాలా మిస్ అవుతున్నాం అంటూ.. ఎమోషనల్ పోస్ట్..
నువ్వు నన్ను వదిలి వెళ్లాక నా జీవితంలో నిండిన చీకటి గురించి మాటల్లో చెప్పలేను.

Actor Venkatesh: ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్ ఇంట్లో విషాదం అలుముకుంది. హీరో వెంకటేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క చనిపోయిందని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నా పెంపుడు శునకం గూగుల్ ఇక లేదు అంటూ ఎమోషన్ అయ్యారు వెంకటేశ్. గూగుల్ కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన వెంకటశ్.. గూగుల్తో ఆత్మీయ క్షణాలను గుర్తు చేసుకున్నారు.
గూగుల్ ను ఓ బిడ్డలా ఎంతో ప్రేమగా చూసుకున్నట్లు వెంకటేశ్ తెలిపారు. 12 ఏళ్లు అది తమతోనే ఉందన్నారు. ‘‘నా ప్రియమైన గూగుల్. 12 ఏళ్లు ఎంతో ప్రేమ, అందమైన జ్ఞాపకాలు నింపావు. నువ్వు మా సన్ షైన్. ఇక నీకు వీడ్కోలు. నువ్వు నన్ను వదిలి వెళ్లాక నా జీవితంలో నిండిన చీకటి గురించి మాటల్లో చెప్పలేను. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. నా ప్రియమైన మిత్రమా’’ అని తన పోస్ట్ లో బాగా ఎమోషనల్ అయ్యారు వెంకటేశ్. తన పెట్ డాగ్‌తో తీసుకున్న ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. కాగా, వెంకటేశ్ నటించిన F2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలోనూ గూగుల్ కనిపించింది.
Also Read: ఒక్కసారిగా వచ్చి హగ్ చేసుకున్నారు.. నా కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి: బార్బరిక్ సినిమా దర్శకుడు
View this post on Instagram