IDBI Bank Recruitment 2023 : IDBI లో 2100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు రుసుము SC/ST/PwBD అభ్యర్థులకు ₹200/- , మిగతా అభ్యర్థులందరికీ ₹1000/-. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌; https://www.idbibank.in/ పరిశీలించగలరు.

idbi bank recruitment 2023

IDBI Bank Recruitment 2023 : IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ idbibank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 2100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 22న ప్రారంభమైంది. డిసెంబర్ 6, 2023న ముగుస్తుంది.

READ ALSO : kalonji Benefits : బరువు తగ్గటంతోపాటు, షుగర్ ను కంట్రోల్ లో ఉంచే గింజల పొడి ఇదే ?

ఖాళీ వివరాలు ;

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’: 800 పోస్టులు

ఎగ్జిక్యూటివ్స్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO): 1300 పోస్ట్‌లు

READ ALSO : గూగుల్ పే యూజర్లకు వార్నింగ్.. ఈ యాప్స్ యమ డేంజర్

అర్హతలు ;

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’: ప్రభుత్వం లేదా ప్రభుత్వం ఆమోదించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో జనరల్ మరియు OBC అభ్యర్థులకు (SC/ST/PwBD అభ్యర్థులకు 55%) కనీసం 60%తో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎగ్జిక్యూటివ్‌లు – సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO): ప్రభుత్వం, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన/ ఆమోదించబడిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థి వయస్సు పరిమితి 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

READ ALSO : Gastric Cancer : కడుపులో ఇన్ఫెక్షన్ సమస్యలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు దారితీస్తాయా ?

ఎంపిక ప్రక్రియ ;

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్ (OT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), పర్సనల్ ఇంటర్వ్యూ (PI) మరియు ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ (PRMT) ఉంటాయి.

ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్ (OT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) మరియు ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ (PRMT) ఉంటాయి.

READ ALSO : Uttarkashi tunnel rescue : చివరి దశకు చేరుకున్న ఉత్తరకాశి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌…41 మంది కార్మికులు మరికొద్దిసేపట్లో బయటకు…

దరఖాస్తు రుసుము ;

దరఖాస్తు రుసుము SC/ST/PwBD అభ్యర్థులకు ₹200/- , మిగతా అభ్యర్థులందరికీ ₹1000/-. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌; https://www.idbibank.in/ పరిశీలించగలరు.

ముఖ్యమైన తేదీలు ;

దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 22, 2023

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 6, 2023

READ ALSO : Nara Lokesh : నవంబర్ 27నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఆన్‌లైన్ పరీక్ష: డిసెంబర్ 31, 2023

ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్  ఆన్‌లైన్ పరీక్ష: డిసెంబర్ 30, 2023

ట్రెండింగ్ వార్తలు