Jobs: సమయం లేదు మిత్రమా.. ఈ ఉద్యోగాలకు తుది గడువు ముగుస్తోంది.. వివరాలు చూడండి
ఈ పోస్టులో 3 సంవత్సరాలు పూర్తి చేసిన అభ్యర్థులకు గ్రేడ్-ఏ ఆఫీసర్‌గా పదోన్నతికి అవకాశముంది.

IDBI
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల్లోకి చేరే ముందు అభ్యర్థులకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రత్యేకంగా PGDBF (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్) కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.
అభ్యర్థులు 2025 మార్చి 1 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు పరంగా 2025 మార్చి 1 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
PGDBF కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 0 హోదాలో ఉద్యోగాలు పొందుతారు. మొదట్లో వార్షిక జీతం రూ.6.14 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఉంటుంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..
ఈ పోస్టులో 3 సంవత్సరాలు పూర్తి చేసిన అభ్యర్థులకు గ్రేడ్-ఏ ఆఫీసర్‌గా పదోన్నతికి అవకాశముంది. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం ప్రొబేషన్‌లో ఉంటారు. ఉద్యోగ నియామకం సమయంలో కనీసం 3 సంవత్సరాలు బ్యాంకులో పనిచేస్తామని అంగీకరిస్తూ రూ.2 లక్షల సర్వీస్ బాండ్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 మార్చి 12 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ టెస్ట్ 2025 ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2025 వివరాలు
- మొత్తం ఖాళీల సంఖ్య: 650
- అర్హత: 2025 మార్చి 1 కల్లా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
- దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మార్చి 1 నుంచి ప్రారంభం. తుది గడువు 2025 మార్చి 12 వరకు.
- వయస్సు: 20-25 ఏళ్లు (2025 మార్చి 1 నాటికి) SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBCలకు 3 ఏళ్లు గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎంపిక విధానం: పరీక్ష + ఇంటర్వ్యూ
- శిక్షణ: 6 నెలలు క్లాస్‌రూం, 2 నెలలు ఇంటర్న్‌షిప్, 4 నెలలు ఆన్‌జాబ్ ట్రైనింగ్ ఇలా ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
- స్టైఫండ్: కోర్సు చేస్తున్న సమయంలో నెలనెలా స్టైఫండ్ అందుతుంది
- జాబ్ ప్యాకేజీ: మొదట్లో ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.5 లక్షల దాకా జీతం ఉంటుంది. ఇదే పోస్టులో మూడేళ్లు అనుభవం వచ్చాక Grade -A ఆఫీసర్లుగా ప్రమోషన్ ఇస్తారు.
- పూర్తి వివరాలకు: అధికారిక వెబ్‌సైట్ https://ibpsonline.ibps.in/idbipgfeb25/ చూడండి.