IIMలో 100% ప్లేస్‌మెంట్‌: విద్యార్థుల‌కు ల‌క్ష‌ల్లో జీతం

ప్రీమియర్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ IIM(ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్) కోల్ కతా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 100 శాతం ప్లేస్ మెంట్ సాధించింది. 441 పీజీపీ (PGP)ప్రొగ్రామ్ పూర్తిచేసిన విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించారు.

  • Published By: sreehari ,Published On : February 11, 2019 / 07:14 AM IST
IIMలో 100% ప్లేస్‌మెంట్‌: విద్యార్థుల‌కు ల‌క్ష‌ల్లో జీతం

ప్రీమియర్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ IIM(ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్) కోల్ కతా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 100 శాతం ప్లేస్ మెంట్ సాధించింది. 441 పీజీపీ (PGP)ప్రొగ్రామ్ పూర్తిచేసిన విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించారు.

ప్రీమియర్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ IIM(ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్) కోల్ కతా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 100 శాతం ప్లేస్ మెంట్ సాధించింది. 441 పీజీపీ (PGP)ప్రొగ్రామ్ పూర్తిచేసిన విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించారు. ఒక రోజుపాటు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించిన ఐఐఎం విద్యార్థులు ఏడాదికి సగటున రూ.25.36 లక్షలు సంపాదిస్తున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐఐఎంలో విద్యార్థులు సంపాదన రూ.1.16 వరకు పెరిగింది. ఐఐఎం విద్యార్థులను ఎక్కువ మందిని రిక్రూట్ చేసిన కంపెనీల్లో ఏసెంచర్ (Accenture)అతిపెద్ద రిక్రూటర్ గా నిలిచింది. ఐఐఎం ఆఫర్ చేసిన 24 మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకున్నట్టు ఐఐఎం కోల్ కతా ఒక ప్రకటనలో తెలిపింది. IIM ప్లేస్ మెంట్ ప్రాసెస్ లో భాగంగా 123 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఐఐఎం రిక్రూట్ మెంట్ లో పలు బ్రాంచులకు చెందిన 501 మంది విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చింది. 
 

ఇందులో 15 శాతం బ్యాచ్ ఒకదాని కంటే ఎక్కువ ఆఫర్లు పొందాయి. ఈ రిక్రూట్ మెంట్ ప్రొగామ్స్ కు సగం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. కన్స్ ల్టెంగ్ (29 శాతం), ఫైనాన్స్ (21 శాతం) రంగాల విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. జనరల్ మేనేజ్ మెంట్ లో 14 శాతం మంది విద్యార్థులను రిక్రూటర్లు సెలెక్ట్ చేశారు. మార్కెటింగ్, సేల్స్ విభాగాల విద్యార్థులను 12 శాతం రిక్రూట్ అయ్యారు. ఐటీ ఎనాలిటిక్స్ 8 శాతం మంది విద్యార్థులు ఉద్యోగం సాధించారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంపెనీల పేర్లను ఐఐఎం కోల్ కతా రివీల్ చేసింది. గోల్డ్ మ్యాన్ సాచ్, బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ )బీఎఎంఎల్, సిటి, జేపీ మోర్గాన్ ఛేజ్ పలు కంపెనీలు పాల్గొన్నాయి.