IIT JAM 2025 Admit Cards Released
IIT JAM 2025 Admit Cards : ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఢిల్లీ, ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM) కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసేందుకు జామ్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.
దరఖాస్తుదారులు కార్డులను డౌన్‌లోడ్ చేసేందుకు రిజిస్టర్ నెంబర్, పాస్‌వర్డ్ వంటి వారి లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి. 22 ఐఐటీలు, ఇతర భాగస్వామ్య సంస్థలలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MSc, MSc-PhD) కంబైన్డ్ కోర్సులలో అడ్మిషన్ కోరుకునే వారి కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
Read Also : Moto G05 : కొత్త మోటో జీ05 ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
IIT JAM 2025 Admit Cards
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 2, 2025న 100 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఐఐటీ జామ్ ఫలితాలు మార్చి 16, 2025న ప్రకటించనున్నారు. జామ్ 2025 అనేది 7 టెస్ట్ పేపర్‌లతో జరిగే కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్ష. ఈ పరీక్షలో 3 రకాల ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQ), మల్టీ చాయిస్ ప్రశ్నలు (MSQ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (NAT) ప్రశ్నలు ఉంటాయి. అర్హత సాధించిన అభ్యర్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీలో సుమారు 3వేల సీట్లకు అర్హులు, అదనపు ఎవాల్యుషన్ ప్రాసెస్ అవసరం లేదు.
ఐఐటీ జేఎఎం JAM అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేయాలంటే? :
Read Also : గేట్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..