GATE 2025 : గేట్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..

GATE 2025 Admit Cards : అడ్మిట్ కార్డ్‌ల కోసం అభ్యర్థులు తమ రిజిస్టర్ నెంబర్/ ఇమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

GATE 2025 : గేట్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..

GATE 2025 Admit Cards

Updated On : January 7, 2025 / 6:42 PM IST

GATE 2025 Admit Cards : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2025 కోసం అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసేందుకు (GATE 2025) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. తమ అడ్మిట్ కార్డ్‌లను యాక్సెస్ చేసేందుకు అభ్యర్థులు తమ రిజిస్టర్ నెంబర్/ ఇమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Read Also : CBSE CTET Answer Key 2024 : సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీ 2024 త్వరలో విడుదల.. డేట్, టైమ్ అప్‌‌టేట్ వివరాలివే!

గేట్ అడ్మిట్ కార్డ్‌లను ముందుగా జనవరి 2, 2025న విడుదల చేయాలని నిర్ణయించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం ఫిబ్రవరి 1, 2, 15, 16, 2025 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. గేట్ 2025 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించనున్నారు. నగర కేంద్రాలను 8 జోన్‌లుగా విభజించారు. రిజల్ట్స్ మార్చి 19, 2025న ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

GATE 2025 Admit Cards

GATE 2025 Admit Cards

గేట్ 2025 అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి :

  • అధికారిక వెబ్‌సైట్, (gate2024.iisc.ac.in)ని విజిట్ చేయండి.
  • రిజిస్టర్ నెంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
  • గేట్ లాగిన్‌పై క్లిక్ చేయండి.
  • అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ కోసం లింక్‌ని ఎంచుకోండి.
  • అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి
  • గేట్ పరీక్ష కోసం ప్రింటవుట్ తీసుకోండి.

గేట్ 2025 : పేపర్ ప్యాటర్న్ :
గేట్ 2025లో 30 పరీక్షా పత్రాలు ఉంటాయి. అభ్యర్థులు ఒకటి లేదా రెండు టెస్ట్ పేపర్‌లను ఎంచుకోవచ్చు. పరీక్ష వ్యవధి 3 గంటలు, గేట్ స్కోర్‌లు ఫలితాల ప్రకటన తేదీ నుంచి మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి. పరీక్షలో మూడు ఫార్మాట్లలో ప్రశ్నలు ఉంటాయి.

మల్టీ ఆప్షనల్ ప్రశ్నలు (MCQ), మల్టీ ఆప్షనల్ ప్రశ్నలు (MSQ), న్యూమరిక్ ఆన్సర్ టైప్ (NAT) ప్రశ్నలు ఉంటాయి. రీకాల్, కాంప్రహెన్షన్, అప్లికేషన్, ఎనాలిసిస్, సింథసిస్‌పై అభ్యర్థులను ఎవల్యూషన్ చేస్తారు. అధికారిక వెబ్‌సైట్ గేట్ 2025 అభ్యర్థుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)తో వివిధ పరీక్షలకు మాక్ టెస్ట్ లింక్‌లను కూడా అందిస్తుంది.

Read Also : Moto G05 : కొత్త మోటో జీ05 ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?