Moto G05 : కొత్త మోటో జీ05 ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Moto G05 Launch : భారత మార్కెట్లో మోటో జీ05 బడ్జెట్ ఫోన్ ధర రూ.6,999 వద్ద లాంచ్ అయింది. ఈ ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది.

Moto G05 : కొత్త మోటో జీ05 ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Motorola launches Moto G05 in India

Updated On : January 7, 2025 / 6:05 PM IST

Moto G05 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో మోటోరోలా 2025లో ఫస్ట్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ మోటో జీ-సిరీస్ కంపెనీ అత్యంత పాపులర్ సిరీస్‌లలో ఒకటి. బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు.. అనేక ప్రీమియం ఫీచర్లను కూడా అందిస్తుంది. ఉదాహరణకు.. మోటో జీ05 ఫోన్ పెద్ద 6.67-అంగుళాల డిస్‌ప్లే, ఆకర్షణీయమైన డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంది. ఫోన్ బ్రైట్ కలర్ ఆప్షన్‌లతో వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసునే ముందు ధర, లభ్యత వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!

మోటో జీ05 ధర, లభ్యత :
భారత మార్కెట్లో మోటోరోలా జీ05 ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రూ.6,999 వద్ద లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇన్‌బిల్ట్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. సేల్ జనవరి 13, 2025, మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ (Motorola.in), ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మోటో జీ05 రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఫారెస్ట్ గ్రీన్, ప్లం రెడ్ వేగన్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Motorola launches Moto G05 in India

Moto G05 Launch

మోటో G05 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
మోటో జీ05 ఫోన్ 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అత్యధికంగా 1000-నిట్స్ గరిష్ట ప్రకాశం, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఆకర్షణీయమైన నాచ్-లెస్ లేఅవుట్‌తో రూపొందింది. అదనపు మన్నిక కోసం గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ కలిగి ఉంది. మోటరోలా డిస్‌ప్లే సెగ్మెంట్‌లో అత్యంత ప్రకాశవంతంగా ఉందని పేర్కొంది. అడాప్టివ్ ఆటో మోడ్ కంటెంట్ ఆధారంగా రిఫ్రెష్ రేట్‌ను 90Hz నుంచి 60Hz వరకు సర్దుబాటు చేస్తుంది. బ్యాటరీ లైఫ్ ఆప్టిమైజ్ చేస్తుంది. అదనంగా, డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో ద్వారా ఆధారితమైన 7ఎక్స్ బాస్ బూస్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంది.

అంతేకాకుండా, డిస్ప్లే వాటర్ టచ్ టెక్నాలజీతో వస్తుంది. తడి లేదా చెమటతో ఉన్న చేతుల్లో పట్టుకున్నా వెంటనే డిస్‌ప్లే క్లీన్ చేస్తుంది. ఈ డివైజ్ ఫారెస్ట్ గ్రీన్, ప్లం రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మన్నికైనది మాత్రమే కాకుండా అడ్వాన్స్ ప్రొటెక్షన్ కోసం ఐపీ52 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. మోటో జీ05 సెగ్మెంట్‌లో ఆండ్రాయిడ్ 15 అవుట్ ది బాక్స్‌ను కలిగిన ఏకైక స్మార్ట్‌ఫోన్.

Moto G05 : గత వెర్షన్లతో పోలిస్తే.. : 

ఆండ్రాయిడ్ 15 మెరుగైన ప్రైవసీ కంట్రోల్స్, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్‌లతో మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మోటో జీ05 క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఆధారిత 50ఎంపీ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. నైట్ విజన్ మోడ్‌ను కలిగి ఉంది. 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫేస్ రీటచ్‌తో వస్తుంది. మోటో జీ05 పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ, టైమ్ లాప్స్, లైవ్ ఫిల్టర్, పనోరమా, లెవెలర్ వంటి అనేక విభిన్న కెమెరా మోడ్‌లను కూడా కలిగి ఉంది.

గూగుల్ ఫోటో ఎడిటర్, మ్యాజిక్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎడిటర్ వంటి అదనపు టూల్స్‌తో ఫోన్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మోటో జీ05 మీడియాటెక్ హెలియో జీ81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇన్-బిల్ట్ 4జీబీ ఎల్‌పీడీడీ4ఎక్స్ ర్యామ్, 64జీబీ యూఎఫ్ఎస్2.2 స్టోరేజీని కలిగి ఉంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్‌తో మెరుగైన మల్టీ టాస్కింగ్ కోసం 12జీబీ వరకు ర్యామ్ విస్తరించుకోవచ్చు.

అదనంగా, స్పెషల్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 1టీబీ వరకు విస్తరించవచ్చు. అదనపు సౌలభ్యం కోసం ఫోన్ ట్రిపుల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంటుంది. ఈ అద్భుతమైన ఫీచర్లన్నింటిని వినియోగించేందుకు భారీ 5200mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మోటో జీ05 ఫోన్ సింగిల్ ఛార్జ్‌పై 2 రోజుల వరకు వస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ 18డబ్ల్యూ ఛార్జింగ్ స్పీడ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!