ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలు

భారత వైమానిక దళం (IAF) ఎయిర్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్ x, గ్రూప్ y ట్రేడ్స్ ఎయిర్‌మెన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 2020 జనవరి 2న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక అభ్యర్ధులను మొదటి దశ, రెండో దశ పరీక్షలు, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
విద్యార్హత:
> గ్రూప్ x ట్రేడ్‌కు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాస్ కావాలి, లేదా ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాస్ కావాలి.
> గ్రూప్ y ట్రేడ్‌కు ఇంటర్మీడియట్ 50% మార్కులతో పాస్ కావాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ 50% మార్కులతో పాస్ కావాలి.
వయస్సు:
2000 జనవరి 17 నుంచి 2003 డిసెంబర్ 30 మధ్య పుట్టినవారే అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 2, 2020.
దరఖాస్తు చివరితేది: జనవరి 20, 2020.