Indian Army Agniveer Results: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Indian Army Agniveer Results: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి.

Indian Army Agniveer 2025 CEE Results Released
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in నుంచి తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇక ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 ఎగ్జామ్ జూన్ 30 నుంచి జులై 10 వరకు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 13 భాషల్లో ఈ ఎగ్జామ్ ఫలితాల కోసం అభ్యర్థులు చాలానే ఎదురుచూశారు. తాజాగా ఈ పరీక్షకు సంబందించిన ఫలితాలు విడుదల చేశారు అధికారులు.
మీ ఫలితాలు ఎలా చెక్ చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వె సైట్ joinindianarmy.nic.in లోకి వెళ్ళాలి.
- హోమ్‌పేజీలో జేసీఈ/ఓఆర్/అగ్నివీర్ ఎన్రోల్మెంట్ కింద సీఈఈ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీలో జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్, ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, సబ్జెక్ట్, డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తాయి.
- అభ్యర్థులు తమ వివరాలకు తగ్గ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- ఇప్పుడు స్క్రీన్ పై రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి.
- దానిని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.
ఫలితం తర్వాత ఎం ఉంటుందంటే?
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఫేజ్ II పరిక్షలు అర్హులవుతారు. ఫేజ్ 2లో ముందుగా..
ఫిజికల్ ఫిట్‌నెస్: ఇందులో 1.6 కి.మీ. పరుగు, పుష్-అప్స్, సిట్-అప్స్, పుల్-అప్స్ టెస్టులు ఉంటాయి.
ఫిజికల్ మెజర్‌మెంట్స్: ఎత్తు, బరువు, ఛాతీ కొలతలను పరీక్షిస్తారు.
మెడికల్ ఎగ్జామినేషన్: సమగ్ర ఆరోగ్య పరీక్షను నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: విద్య, వయస్సు, గుర్తింపు, కేటగిరీ సర్టిఫికేట్‌లను అధికారులు చెక్ చేస్తారు.
అడాప్టెబిలిటీ టెస్ట్: మానసిక సామర్థ్య పరీక్ష కూడా నిర్వహిస్తారు.