ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు

ఇంటర్ MPC చదివిన విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇందుకు 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించిన వారికి జూలై 2018 నుంచి శిక్షణ తరగతలు ప్రారంభమవుతాయి. శిక్షణ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగం కల్పిస్తారు. కనీస ఎత్తు 157.5 సెం.మీ. ఉండాలి.
ఎంపిక విధానం:
అభ్యర్థులను ఇంటర్ MPC గ్రూప్‌లో మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి 5 రోజులు రెండు దశల్లో అలహాబాద్, బెంగళూరు, భోపాల్, కపుర్తలా వీటిలో ఏదో ఒక చోట SSB సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
* ఇది రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్-1లో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 నిర్వహిస్తారు. ఈ ఎంపికలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ ప్రక్రియను ఐదు రోజులు నిర్వహిస్తారు. చివరిగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.
ఖాళీలు: 90
విద్యా అర్హత: పెళ్ళికాని అబ్బాయిలు ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.