నేవీలో SSC ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

  • Published By: veegamteam ,Published On : May 15, 2019 / 09:03 AM IST
నేవీలో SSC ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Updated On : May 15, 2019 / 9:03 AM IST

ఇండియన్ నేవీలో వివిధ శాఖల్లో పర్మినెంట్ కమిషన్ (PC), షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అవివాహిత పురుషులు నుంచి నేవల్ అకాడమీ దరఖాస్తులను కోరుతుంది. PC, SSC కోర్సులు 2020, జూన్ నుంచి ప్రారంభం అవుతాయి. కేరళ ఇండియన్ నేవల్ ఆకాడమీలో విద్యార్ధులకు శిక్షణ ఇస్తారు.

విభాగాలవారీ ఖాళీలు:

         పోస్టులు   ఖాళీలు
ఎగ్జిక్యూటివ్ (SSC) 55
టెక్నికల్ (SSC) 48
ఎడ్యకేషన్ (PC) 18
మొత్తం 121

ఉద్యోగాలు:
పైలట్, అబ్జర్వర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఇన్ స్పెక్టర్, ఆఫీసర్స్ (లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)

విద్యార్హత:
సంబంధిత విభాగంలో BE, B.TECH, MSC, BSC, B.COM, PG, MBA, MCA, DGCA వారా కమర్షియల్ పైలట్ లైసన్స్ సర్టిఫికెట్ ఉండాలి. 

ఎంపిక విధానం:
ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేస్తారు.
 
దరఖాస్తు ప్రారంభం: మే 18, 2019

దరఖాస్తు చివరితేది: మే 29, 2019