దరఖాస్తు చేసుకోండి : IOCL లో ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 07:03 AM IST
దరఖాస్తు చేసుకోండి : IOCL లో ఉద్యోగాలు

Updated On : December 28, 2019 / 7:03 AM IST

ప్రభుత్వ రంగ సంస్ధ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL) ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 312 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
అకౌంటెంట్ అప్రెంటీస్ – 25
టెక్నీషీయన్ అప్రెంటీస్ – 128
ట్రేడ్ అప్రెంటీస్ – 129
డేటా ఎంట్రీ ఆపరేటర్(ఫ్రెషర్) – 13
డేటా ఎంట్రీ ఆపరేటర్(సిల్క్ సర్టిఫికేట్ హోల్డర్) – 12

విద్యార్హత :
అభ్యర్ధులు ఇంటర్, డిగ్రీ, డిప్లామా ఇంజనీరింగ్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు : అభ్యర్ధులకు నవంబర్ 30,2019 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

ఎంపికా విధానం :
అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 26,2019
దరఖాస్తు చివరి తేది : జనవరి 22,2020
పరీక్ష తేది : పిబ్రవరి 2,2020