JEE అడ్వాన్స్‌డ్-2019 పరీక్ష తేది విడుదలైంది

  • Published By: veegamteam ,Published On : February 21, 2019 / 08:44 AM IST
JEE అడ్వాన్స్‌డ్-2019 పరీక్ష తేది విడుదలైంది

Updated On : February 21, 2019 / 8:44 AM IST

జాతీయ విద్యాసంస్థల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘JEE అడ్వాన్స్‌డ్-2019 ఎగ్జామినేషన్’ నోటిఫికేషన్ విడుదలైంది. IITరూర్కీ గురువారం (ఫిబ్రవరి 21) JEE అడ్వాన్స్‌డ్-2019కు సంబంధించిన ప్రవేశ ప్రకటనను విడుదల చేసింది. JEE మెయిన్‌(పేపర్-1)లో అర్హత పొందే అన్ని వర్గాలకు చెందిన 2.24 లక్షల మంది అభ్యర్థులకు JEE అడ్వాన్స్‌-2019 పరీక్ష నిర్వహించనున్నారు. 

JEE మెయిన్ పరీక్షలకు సంబంధించి జనవరి సెషన్ పరీక్షలు పూర్తయి.. ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇక ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ నెలాఖరుకు ఫలితాలను విడుదల చేయనున్నారు. 

* ఎంపిక విధానం:
రెండు విడతల వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. అందులో 2,24,000 ర్యాంకు లోపు వచ్చిన అభ్యర్థులను JEE అడ్వాన్స్‌డ్-2019 పరీక్షలకు ఎంపిక చేస్తారు. 

* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
మే మొదటివారంలో JEE అడ్వాన్స్‌డ్-2019 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 19న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. 

* విద్యా అర్హతలు.. 
– అభ్యర్థులు JEE మెయిన్-2019 పేపర్-1లో 2,24,000 ర్యాంకు లోపల ఉండాలి. – అక్టోబర్ 1, 1994 తర్వాత జన్మించి ఉండాలి. – SC, ST, దివ్యాంగులకు వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది. 
– అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ 2017, అంతకు ముందు పరీక్ష రాసి ఉండకూడదు. 2018 లేదా 2019లో మొదటిసారి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలకు హాజరై ఉండాలి. 
– గతంలో IITలో ప్రవేశం పొంది ఉండకూడదు. 

* దరఖాస్తు ఫీజు.. 
– రూ.2600 చెల్లించాలి. 
– SC, ST, దివ్యాంగులు, బాలికలు మాత్రం రూ.1300 + GST. 
– విదేశాలకు చెందిన అభ్యర్థులు 75 డాలర్లు చెల్లించాలి. 
– ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు 150 డాలర్లు చెల్లించాలి. 

* ముఖ్యమైన తేదీలు..
– JEE అడ్వాన్స్‌డ్-2019 పరీక్ష తేది: మే 19,2019. 

* పరీక్ష సమయం.. 
పేపర్-1:  ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహనం 12 గంటల వరకు.
పేపర్-2 మధ్యాహనం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు.