JEE Main 2025 Application : జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. మీ దరఖాస్తులో తప్పులుంటే ఇలా ఎడిట్ చేయొచ్చు.. డైరెక్ట్ లింక్ మీకోసం..!
JEE Main 2025 Application Correction : జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 కోసం అప్లికేషన్ కరెక్షన్ విండో నవంబర్ 26, నవంబర్ 27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

JEE Main 2025 Application Correction Window Opens
JEE Main 2025 Application Correction : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 కోసం కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. జేఈఈ మెయిన్ 2025 దరఖాస్తు ఫారమ్‌లలో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (jeemain-nta.nic.in)ని విజిట్ చేయొచ్చు.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 కోసం అప్లికేషన్ కరెక్షన్ విండో నవంబర్ 26, నవంబర్ 27 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. అధికారిక నోటీసు ప్రకారం.. అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, పర్మినెంట్/కరెంట్ అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్టు వివరాలు, ఫోటోగ్రాఫ్‌లను మార్చడానికి అనుమతించరని గమనించాలి.
అభ్యర్థులు ఈ కింది వివరాలలో దేనినైనా మార్చవచ్చు :
- పేరు
- తల్లి పేరు
- తండ్రి పేరు
అభ్యర్థులు ఈ ఫీల్డ్‌లన్నింటినీ మార్చుకోవచ్చు.
- 10వ తరగతి/తత్సమాన వివరాలు
- 12వ తరగతి/తత్సమాన వివరాలు
- పాన్ నంబర్
- పుట్టిన తేదీ
- లింగం
- కేటగిరీ
- సబ్ కేటగిరీ
- PwD స్టేటస్
- సిగ్నేచర్
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 దరఖాస్తు ఎడిట్ ఫారం: ఎలా ఎడిట్ చేయాలంటే?
- జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ను (jeemain-nta.nic.in) విజిట్ చేయండి.
- హోమ్ పేజీలో JEE మెయిన్ 2025 జనవరి సెషన్ అప్లికేషన్ కరెక్షన్ లింక్‌పై క్లిక్ చేయండి
- మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి
- దరఖాస్తు ఫారమ్‌లో మార్పులను జాగ్రత్తగా చేయండి.
జేఈఈ మెయిన్ 2025 కరెక్షన్ విండో : డైరెక్ట్ లింక్
- దరఖాస్తులో మార్పుల కోసం అవసరమైన రుసుము చెల్లించండి
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి
జేఈఈ మెయిన్ 2025 పరీక్ష తేదీలు :
జేఈఈ మెయిన్ 2025 ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి 13 భాషలలో నిర్వహించనున్నారు. NTA JEE మెయిన్ 2025ని జనవరి, ఏప్రిల్ నెలలో రెండు సెషన్లలో నిర్వహిస్తుంది. జేఈఈ మెయిన్ 2025 జనవరి పరీక్షను తాత్కాలికంగా జనవరి 22 నుంచి జనవరి 31, 2025 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు.