JEE Main 2025 Exam
JEE Main 2025 Exam : జేఈఈ మెయిన్ పరీక్ష రేపు (జనవరి 22, 2025న) ప్రారంభం కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2025 పరీక్ష కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షకు 13.8 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్ 2025 పరీక్షకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని (jeemain.nta.nic.in)లో అధికారిక ఎన్టీఏ వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు.
Read Also : JEE Mains Exam : జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై ఇంటర్ విద్యార్థుల తీవ్ర ఆవేదన
పేపర్ 1 (బీఈ/బీటెక్) జనవరి 22, 23, 24, 28, 29, 2025 తేదీల్లో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2ఎ (B.Arch), పేపర్ 2బీ (B.Planning), పేపర్ 2ఎ & 2బీ (B.Arch, B.Planning) జనవరి 30, 2025న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు నిర్వహిస్తుంది.
జేఈఈ మెయిన్ 2025 డ్రెస్ కోడ్ సాధారణ మార్గదర్శకాలివే :
భద్రతాపరమైన సమస్యలను నివారించేందుకు డ్రెస్ కోడ్ సౌకర్యంపై దృష్టి పెడుతుంది. అభ్యర్థులు భద్రతా తనిఖీలకు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నందున మెటాలిక్ అప్లియన్సెస్ ధరించడం మానుకోవాలి. దుస్తులు తేలికగా సీజన్‌కు తగినవిగా ఉండాలి.
పురుష అభ్యర్థుల కోసం :
మహిళా అభ్యర్థుల కోసం:
Read Also : JEE Main 2025 : ఈ 19న జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!