JEE Main 2025 : ఈ 19న జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
JEE Main 2025 : జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్‌ను ఈ నెల 19న విడుదల కానుంది. అడ్మిట్ కార్డ్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

JEE Main 2025 Admit Card To Be Released
JEE Main 2025 Admit Card : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో హాజరయ్యే అభ్యర్థుల కోసం జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్‌ను త్వరలో విడుదల చేయనుంది. అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్ (jeemain.nta.nic.in)లో డౌన్‌లోడ్ చేసేందుకు అందుబాటులో ఉంటుంది.
Read Also : Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ.. 100కి పైగా వాహనాల ప్రదర్శనలు!
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 జనవరి 22, 23, 24, 28, 29, 30, 2025 తేదీల్లో జరగాల్సి ఉంది. నివేదిక ప్రకారం.. ప్రతి పరీక్ష తేదీకి 3 రోజుల ముందు ఎన్టీఏ అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేస్తుంది. జనవరి 22న హాజరయ్యే అభ్యర్థులకు జనవరి 19న అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంటుంది.
జనవరి 23న పరీక్షకు హాజరయ్యే వారు జనవరి 20న తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 24న జరిగే పరీక్షకు జనవరి 21న అడ్మిట్ కార్డ్ విడుదల అవుతుంది. అదేవిధంగా, జనవరి 28 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ జనవరి 25న విడుదల కానుంది. జనవరి 29న హాజరయ్యే అభ్యర్థులు జనవరి 26న తమ అడ్మిట్ కార్డును యాక్సెస్ చేయవచ్చు. జనవరి 30న జరిగే పరీక్షకు జనవరి 27న అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంటుంది.
జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
- జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్‌ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసేందుకు అభ్యర్థులు ఈ కింది విధంగా ప్రయత్నించాలి.
- అధికారిక జేఈఈ మెయిన్ 2025 వెబ్‌సైట్ (jeemain.nta.nic.in)ను విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో, జేఈఈ మెయిన్ సెషన్ 1 అడ్మిట్ కార్డ్ 2025కి సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.
- మీరు కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో సహా మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
- మీ జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.
Read Also : JEE Main 2025 Application : జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. మీ దరఖాస్తులో తప్పులుంటే ఇలా ఎడిట్ చేయొచ్చు..