Handloom and Textile Jobs: ఏపీ చేనేత, జౌళీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Handloom and Textile Jobs: జౌళీ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ చేనేత అభివృద్ధి పథకం, స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ లో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Handloom and Textile Jobs: ఏపీ చేనేత, జౌళీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Job opportunities in AP Handloom and Textile Department

Updated On : July 8, 2025 / 3:03 PM IST

నిరుద్యోగులకు ఏపీ చేనేత, జౌళీ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ చేనేత అభివృద్ధి పథకం, స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ లో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్‌లో 5, టెక్స్ టైల్ డిజైనర్స్‌లో 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈమేరకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

విద్యా, అనుభవ అర్హత:

క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్: ఈ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునేవారు హ్యాండ్లూమ్ టెక్నాలజీ (DHT) లేదా టెక్స్ టైల్ టెక్నాలజీ నందు డిగ్రీ/డిప్లొమా పూర్తి చేయాల్సి ఉంటుంది. సంబంధిత రంగంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అలాగే MS Word, Excel, పవర్ పాయింట్, ఖాతా పుస్తకాల, రికార్డులు నిర్వహణలో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

టెక్స్ టైల్ డిజైనర్: ఈ పోస్ట్ కు డిజైన్లు రూపొందించే నైపుణ్యం కలిగి ఉండాలి లేదా ఏదైనా ప్రఖ్యాత సంస్థ/ఇన్స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే చేనేత విభాగంలో 2 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.

జాబ్ నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల లోపు దరఖాస్తుదారులు తమ ధృవపత్రాల కాపీలతో పాటు బయోడేటాను కమిషనర్, జౌళీ చేనేత శాఖ, 4వ అంతస్తు, కార్పొరేట్ బిల్డింగ్, ఐహెచ్సీ ఆటోనగర్, గుంటూరు జిల్లా, మంగళగిరి-522503 నందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని సందేహాల కోసం http://www.handlooms.nic.in ను సందర్శించండి.