Power Grid Corporation : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Power Grid Corporation : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ

Power Grid

Updated On : May 16, 2022 / 3:01 PM IST

Power Grid Corporation : భారత ప్రభుత్వ రంగ సంస్ధ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. న్యూదిల్లీ కేంద్రంగా పనిచేసే నార్త్ ఈస్టర్న్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ లో మొత్తం 75 ఖాళీలను భర్త చేయనున్నారు. ఈ పోస్టులన్నింటినీ కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి ఫీల్డ్ ఇంజనీర్లు 35 ఖాళీలు, ఫీల్డ్ సూపర్ వైజర్లు 40 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉన్న వారు అర్హులు. అభ్యర్ధుల వయోపరిమితి 25 సంవత్సరాలకు మించకూడదు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారు. దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదిగా జూన్ 1, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.powergrid.in/ పరిశీలించగలరు.