Manganese Ore India Limited
Job Vacancies : మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(మొయిల్) నాగ్‌పుర్‌లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి బ్లాస్టర్ గ్రేడ్-II: 11 పోస్టులు, మైన్ మేట్ గ్రేడ్-I: 15 పోస్టులు, సెలెక్ట్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్/ ట్రైనీ ఎంపిక గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్: 05 పోస్టులు,మైన్ ఫోర్‌మాన్-1: 01 పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Job Vacancies : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను బట్టి పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. మైన్ ఫోర్‌మ్యాన్ సర్టిఫికేట్, డిప్లొమా మైనింగ్& మైన్ సర్వేయింగ్, బ్లాస్టర్స్ సర్టిఫికేట్ కాంపీటెన్సీ తోపాటుగా పనిఅనుభం కలిగి ఉండాలి. పోస్టుల వారీగా వయోపరిమితి 35 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
READ ALSO : Vegetable Farming : ఊరు ఊరంతా ఆకు కూరల సాగు.. మంచి లాభాలు ఆర్జిస్తున్న రైతులు
ఎంపిక విధానానికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ.295. నిబంధనలకు ప్రకారం ఎస్సీ/ ఎస్సీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. సరైన అర్హతలున్నవారు నవంబరు 9, 2023లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://moil.nic.in/ పరిశీలించగలరు.