Job Vacancies : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

విభాగాల వారీగా పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే సివిల్: 30 పోస్టులు, మెకానికల్: 30 పోస్టులు, హెచ్‌ఆర్: 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

Job Vacancies : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

BHEL Recruitment 2023

Job Vacancies : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 75 సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో జనరల్-36, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-10, ఎస్సీ-07, ఎస్టీ-06. పోస్టులు కేటాయించారు.

READ ALSO : Vegetable Farming : ఊరు ఊరంతా ఆకు కూరల సాగు.. మంచి లాభాలు ఆర్జిస్తున్న రైతులు

విభాగాల వారీగా పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే సివిల్: 30 పోస్టులు, మెకానికల్: 30 పోస్టులు, హెచ్‌ఆర్: 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిచేస్తారు.

READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట

ఎంపికైన వారికి ఎంపికైనవారికి శిక్షణ కాలంలో రూ.32,000 – రూ.1,00,000 (బేసిక్ పే రూ.32,000) చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.33,500-రూ.1,20,000 (బేసిక్ పే రూ.33,500) చెల్లిస్తారు. వయోపరిమితి 27 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా రూ.795. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.295 చెల్లించాల్సి ఉంటుంది.

READ ALSO : Robot In Agriculture : వ్యవసాయంలోకి రోబో.. ఎకరంలో కలుపుతీత ఖర్చు రూ. 50

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరిగడువు 25.11.2023.తేదిగా నిర్ణయించారు. ఆన్ లైన్ దరఖాస్తుకు వెబ్ సైట్ ; https://careers.bhel.in/ పరిశీలించగలరు.