Bank of Baroda Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీ!
అభ్యర్థుల వయస్సు 27 నుంచి 40 ఏళ్లు ఉండాలి.జనరల్ కేటగిరీ, EWS మరియు OBC కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ, మహిళా కేటగిరీ అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Many posts are filled in Bank of Baroda!
Bank of Baroda Recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీకి చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం15 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఫుల్ టైమ్ MBA లేదా PGDM లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1.78 లక్షల జీతం లభిస్తుంది. అభ్యర్థుల యొక్క వయస్స 27 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 27 నుంచి 40 ఏళ్లు ఉండాలి.జనరల్ కేటగిరీ, EWS మరియు OBC కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయల దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ, మహిళా కేటగిరీ అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 24లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక సైట్ ; bankofbaroda.in పరిశీలించగలరు.