Mega DSC: సంక్రాంతి వేళ ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది..

బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్హత ఉన్న నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను..

Minister Botsa Satyanarayana

సంక్రాంతి వేళ ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ పండుగ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న బొత్స సత్యనారాయణకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. అర్హత ఉన్న నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను వినియోగించుకోవాలని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌‌తో మెగా డీఎస్సీ గురించి చర్చించామన్నారు. పోస్టుల సంఖ్య, భర్తీపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు.

iQOO Neo 7 Pro Price Drop : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. ఐక్యూ నియో 7 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. ఈ ఫోన్ కొనాలా వద్దా?