MP Metro Rail Recruitment : మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్యప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా 10వ, 12వ తరగతి ఉత్తీర్ణత, ITI, ఇంజనీరింగ్ మరియు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

Metro Rail Corporation

MP Metro Rail Recruitment : మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 88 పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో సూపర్‌వైజర్‌ (ఆపరేషన్‌) 26 పోస్టులు , మెయింటెయినర్‌ 12 పోస్టులు, సూపర్‌వైజర్‌ 9 పోస్టులు, మెయింటెయినర్‌ (ట్రాక్షన్‌) 9 పోస్టులు, సూపర్‌వైజర్‌ (ట్రాక్షన్‌)8 పోస్టులు, సూపర్‌వైజర్‌ (ట్రాక్‌), స్టోర్‌ 2, అసిస్టెంట్‌ హెచ్‌ఆర్‌ అండ్‌ అకౌంట్స్‌ 2 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Koel Birds : కోకిల కాకి గూట్లో గుడ్లు పెట్టటానికి అసలు కారణం

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా 10వ, 12వ తరగతి ఉత్తీర్ణత, ITI, ఇంజనీరింగ్ మరియు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

READ ALSO :  Joint Pains : ఈ లడ్డు రోజుకు ఒకటి తింటే చాలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మాయం !

ఎంపికైన అభ్యర్థులకు 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు వేతనం లభిస్తుంది. జనరల్ / OBC కేటగిరీ అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ కోసం రూ. 590 ఫీజు చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ఫీజుగా రూ. 295 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://mpmetrorail.com/ పరిశీలించగలరు.