NACLO లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NACLO)లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 120 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ – 45
ఎలక్ట్రాకల్, పవర్ ఇంజనీరింగ్ – 29
ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 15
కెమికల్ ఇంజనీరింగ్ – 9
మెటల్లార్జికల్ ఇంజనీరింగ్ – 13
సివిల్ – 5
ఆర్కిటెక్చర్, సిరామిక్స్ ఇంజనీరింగ్ – 5
మైనింగ్ ఇంజనీరింగ్ , డిప్లామా – 4
విద్యార్హత : అభ్యర్దులు 55 శాతం మార్కులతో బీటెక్, టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. 2019, 2020 గేట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : అభ్యర్దుల వయసు మార్చి 20, 2020 నాటికి 30 సంవత్సరాలకు మించరాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, EWS అభ్యర్దులకు రూ.500 చెల్లించాలి. SC,ST,దివ్యాంగు అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 20, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఏప్రిల్ 4, 2020.