జవహర్ నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జవహర్ నవోదయ పాఠశాలలో 2020-21 సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020 జనవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత:
విద్యార్థి సంబంధిత జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
దరఖాస్తు విధానం:
విద్యార్థులు రెండు దశల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్టేజ్-1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టేజ్-2లో 3,4,5 తరగతుల స్టడీ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి హెడ్ మాస్టర్ సంతకంతో పాటు తండ్రి సంతకం చేసి స్కాన్ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఫోన్ నంబర్ తప్పనిసరి. సెప్టెంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ తెలిపారు.