మే3 నీట్..షెడ్యూల్

  • Published By: madhu ,Published On : August 23, 2019 / 03:53 AM IST
మే3 నీట్..షెడ్యూల్

Updated On : May 28, 2020 / 3:43 PM IST

MBBS, BDS వైద్య కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది మే 3వ తేదీన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ఉద్దేశించిన జేఈఈ మెయిన్స్ మొదటి విడతను జనవరి 06వ తేదీ నుంచి 11వ తేదీ వరకు, రెండో విడత ఏప్రిల్ 03 నుంచి ఏప్రిల్ 09వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నీట్‌ను ఆన్ లైన్లో నిర్వహిస్తారు. 2019, ఆగస్టు 22వ తేదీ గురువారం షెడ్యూల్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట‌ల పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచింది. వివిధ పబ్లిక్ పరీక్షలు, పోటీ పరీక్షలు నిర్వహించే వారు ఈ తేదీలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. 

జేఈఈ మెయిన్ 2020కి సంబంధించి మొదటి విడత పరీక్షలను జనవరిలో, రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తు సెప్టెంబర్ 02 నుంచి 30 వరకు కొనసాగనుంది. జనవరి 06-11 వరకు పరీక్షలు నిర్వహించి..జనవరి 31న ఫలితాలు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 07 నుంచి మార్చి వరకు కొనసాగనుంది దరఖాస్తు ప్రక్రియ. ఏప్రిల్ 03-09 వరకు పరీక్షలు నిర్వహించి..ఏప్రిల్ 30న ఫలితాలు వెల్లడించనున్నారు. 

నీట్ షెడ్యూల్ : – 
రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ : 2019 డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు
అడ్మిట్ కార్డుల డౌన్ లోడింగ్ ప్రక్రియ : 2020 మార్చి 27 నుంచి ప్రారంభం
ప్రవేశ పరీక్ష తేదీ 2020 మే 03
నీట్ ఫలితాల విడుదల 2020 జూన్ 04
Read More : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : 311 ప్రభుత్వ పోస్టులు భర్తీ