NEET MDS 2024 Result : నీట్ ఎండీఎస్ 2024 రిజల్ట్స్ వచ్చేశాయి.. కట్ ఆఫ్ మార్కులను ఇలా చెక్ చేసుకోండి!
NEET MDS 2024 Result : నీట్ ఎండీఎస్ 2024 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏప్రిల్ 12 నుంచి పరీక్షకు హాజరైన అభ్యర్థులు స్కోరుకార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

NEET MDS 2024 Result Announced, Check Cut-Off, Key Details
NEET MDS 2024 Result : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సర్జరీ (NEET MDS) 2024 కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన వారు తమ ఫలితాలను (natboard.edu.in) అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.
మార్చి 18న ఈ నీట్ ఎండీఎస్ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి ఏప్రిల్ 12 నుంచి తమ స్కోర్‌కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక నోటీసు ప్రకారం.. నీట్-ఎండీఎస్ 2024 పరీక్షలో ఒక ప్రశ్న సాంకేతికంగా తప్పుగా గుర్తించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ పూర్తి మార్కులు ఇచ్చారు. ఈ నిర్దిష్ట ప్రశ్నకు ఏదైనా సమాధానం ఇచ్చారా? లేదా అనే దానితో సంబంధం లేకుండా అందరికి పూర్తి మార్కులను కలిపారు.
నీట్ ఎండీఎస్ కట్-ఆఫ్ :
జనరల్, ఈడబ్ల్యూఎస్: 50 పర్సంటైల్, 263 మార్కులు
జనరల్ పీడబ్ల్యూబీడీ : 45 పర్సంటైల్, 246 స్కోర్
పీడబ్ల్యూబీడీతో సహా ఎస్సీ, ఎస్‌టీ, ఓబీసీ 40 పర్సంటైల్, 230 స్కోరు
నీట్ ఎండీఎస్ 2024 పరీక్ష దేశంలోని 259 డెంటల్ కాలేజీలలో మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (MDS) కోసం సుమారు 6,228 సీట్లలో అడ్మిషన్లను కోరుతోంది. ప్రత్యేకంగా ఆల్ ఇండియా 50 శాతం కోటా సీట్లకు మెరిట్ ర్యాంకింగ్‌ను (NBEMS) జారీ చేస్తుంది. అయితే, నీట్ ఎండీఎస్ కోసం తుది మెరిట్ జాబితా, రాష్ట్ర కోటా సీట్ల కోసం కేటగిరీ ఆధారిత మెరిట్ జాబితాలను సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (UT) విడుదల చేస్తాయి.