NEET MDS 2025 Date
NEET MDS 2025 Date : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ (NBEMS), నీట్ ఎండీఎస్ 2025 పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ కోర్సు 2025 లేదా నీట్ ఎండీఎస్ 2025 కోసం నీట్ పీజీ వచ్చే జనవరి 31న నిర్వహించనున్నారు.
ఎన్‌బీఈఎమ్ఎస్ త్వరలో నీట్ ఎండీఎస్ 2025 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ (natboard.edu.in)లో విడుదల చేస్తుంది. అభ్యర్థులు ఎన్‌బిఇఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షకు సంబంధించిన సమాచార బులెటిన్‌లు, దరఖాస్తు ఫారమ్‌లు, ఇతర వివరాలను పొందవచ్చు. నీట్-ఎండీఎస్ అనేది వివిధ ఎండీఎస్ కోర్సులలో ప్రవేశానికి అర్హత-కమ్-ర్యాంకింగ్ పరీక్షగా చెప్పవచ్చు.
నీట్ ఎండీఎస్ 2025: అర్హత ప్రమాణాలు :
మాస్టర్ ఇన్ డెంటల్ సర్జరీ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి, భారత్‌లోని యూనివర్శిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ ద్వారా గుర్తింపు పొందిన బ్యాచిలర్ ఇన్ డెంటల్ సర్జరీ డిగ్రీని కలిగి ఉండాలి. స్టేట్ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసి, తాత్కాలిక లేదా శాశ్వత రిజిస్ట్రేషన్ పొంది, తప్పనిసరి రొటేటరీ ఇంటర్న్‌షిప్ పొంది ఉండాలి. ఆమోదించిన/గుర్తింపు పొందిన డెంటల్ కాలేజీలో ఒక ఏడాది వరకు చదివి ఉండాలి.
Read Also : TSPSC Group 3 Exam : త్వరలో తెలంగాణ గ్రూపు 3 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల.. ఎలా చెక్ చేయాలంటే?