NEET PG Exam 2025 : నీట్ పీజీ పరీక్ష 2025 వాయిదా.. ఇకపై సింగిల్ షిప్ట్‌లోనే.. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటన..!

NEET PG Exam 2025 : నీట్ పరీక్ష 2025 వాయిదా పడింది. ఇకపై సింగిల్ షిప్ట్ లోనే పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా తేదీలు ఇంకా ప్రకటించలేదు.

NEET PG Exam 2025

NEET PG Exam 2025 : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG Exam 2025) వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది.

రెండు షిఫ్టులకు బదులుగా సింగిల్ షిఫ్ట్‌లో నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also : Google Pixel 9 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ పిక్సెల్ ఫోన్ ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు.. వదులుకోవద్దు భయ్యా..!

సింగిల్ షిఫ్ట్ ఎగ్జామ్ కోసం మరిన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. నీట్ పీజీ 2025 కోసం కొత్త తేదీలను త్వరలో ప్రకటించనుంది. నీట్ పీజీ 2025 పరీక్ష ద్వారా దేశంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో మెడికల్ గ్రాడ్యుయేట్లు చేరవచ్చు.

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ద్వారా నిర్వహించే నీట్ పీజీ పరీక్షతో దేశవ్యాప్తంగా MD, MS, PG డిప్లొమా ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందవచ్చు.

నీట్ పీజీ 2025 వాయిదా : 
ముందుగా జూన్ 15, 2025న జరగాల్సిన నీట్ పీజీ 2025 పరీక్ష ఇప్పుడు వాయిదా పడింది. NBEMS నీట్ PG 2025 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు జూన్ 2న ప్రకటించింది.

నీట్ పీజీ 2025 సిటీ (NEET PG Exam 2025) ఇంటిమేషన్ స్లిప్ :
అధికారిక షెడ్యూల్ ప్రకారం.. జూన్ 2న నీట్ పీజీ కోసం అడ్వాన్స్‌డ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను జారీ చేయాలని ఎన్‌బిఇ నిర్ణయించింది.

అయితే, వాయిదా కారణంగా సిటీ స్లిప్, నీట్ పీజీ అడ్మిట్ కార్డ్, పరీక్షకు కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తారు. అనంతరం విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను NBE అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S24 Plus : ఆఫర్ అదిరింది బాస్.. లక్ష ఖరీదైన శాంసంగ్ ఫోన్ జస్ట్ రూ. 47వేలకే.. డోంట్ మిస్!

పరీక్ష తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులు MD, MS, PG డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్‌లో పాల్గొంటారు. 50 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్లకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగిలిన సీట్లను సంబంధిత రాష్ట్ర కౌన్సెలింగ్ అధికారులు నిర్వహిస్తారు.