నిరుద్యోగులకు శుభవార్త : ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు రద్దు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. ఇకపై దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే వారు ఫీజు చెల్లించాల్సిన

  • Published By: veegamteam ,Published On : August 26, 2019 / 09:46 AM IST
నిరుద్యోగులకు శుభవార్త : ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు రద్దు

Updated On : August 26, 2019 / 9:46 AM IST

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. ఇకపై దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే వారు ఫీజు చెల్లించాల్సిన

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ(PWD) నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. ఇకపై దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీ గానే దరఖాస్తు చేసుకోవచ్చు. 7వ పే కమిషన్ చేసిన సిఫార్సు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటికి అప్లయ్ చేసుకునే వారు ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజుతో పాటు ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఇకపై ఆ అవసరం లేదు. దివ్యాంగులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. వారు ఉచితంగానే ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కానీ, ఎగ్జామ్ ఫీజు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ ఫీజులను ప్రభుత్వం మాఫీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇకపై ఆ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే దివ్యాంగుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చెయ్యరు.

2016 జనవరి 1 నుంచి 7వ పే కమిషన్ సిఫార్సుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పలు లాభాలు పొందుతున్నారు. దివ్యాంగులకు ఫీజు మాఫీ చెయ్యాలని సుప్రీంకోర్టు 2016లో తీర్పు ఇచ్చింది. దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయొద్దని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Also Read : గుడ్ న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ