MTech కోర్సులపై క్లారిటీ : ఆ విద్యార్థులకు మాత్రమే ఫీజు పెంపు లేదు

  • Published By: sreehari ,Published On : September 30, 2019 / 01:19 PM IST
MTech కోర్సులపై క్లారిటీ : ఆ విద్యార్థులకు మాత్రమే ఫీజు పెంపు లేదు

Updated On : September 30, 2019 / 1:19 PM IST

ఐఐటీ విద్యా సంస్థల్లో ఆఫర్ చేసే M.Tech కోర్సులకు ఫీజులు పెంపుతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కొత్త ఎంటెక్ విద్యార్థులకు వర్తిస్తుందా? లేదా కొనసాగుతున్న ఎంటెక్ విద్యార్థులకు వర్తిస్తుందో తెలియక గందరగోళం ఏర్పడింది. దీనిపై హెచ్ఆర్ డీ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎంటెక్ కోర్సులపై పెంచిన ఫీజు.. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

‘కొత్త ఎంటెక్ అడ్మిషన్లపై మాత్రమే ఫీజు పెంపు వర్తిస్తుంది. అవసరమైన విద్యార్థులకు ఆర్థికపరంగా సపోర్ట్ అందించడం జరుగుతుంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది. ‘కోర్సులో కొనసాగుతున్న ఎంటెక్ విద్యార్థులకు ఫీజు పెంపు లేదు. కొత్త అడ్మిషన్లకు మాత్రమే ఫీజు పెంపు ఉంటుంది. మూడేళ్ల కాలంలో లేదా ఆపైనా క్రమంగా ఫీజుల పెంపు ఉంటుంది. 

ఐఐటీలో బోర్డు ఆఫ్ గవర్నర్లతో ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకుంటారు’ అని హ్యుమన్ రీసోర్స్ డెవలప్ మెంట్ మినిస్టరీ (HRD) తెలిపింది. ఇక SC/ST/OBC సహా ఇతరులకు రాయితీలు, స్కాలర్ షిపుల్లో ఎలాంటి మార్పులు లేకుండానే కొనసాగుతాయని పేర్కొంది.

ఐఐటీలో కొంతకాలం మాత్రమే కొనసాగుతారో అలాంటి విద్యార్థులకు మాత్రమే ఈ ఫీజు పెంపు ఉంటుంది. అంటే.. మధ్యలోనే కోర్సు ఆపేసి.. ఉద్యోగం కోసం వెళ్లేవారో లేదా పోటీ పరీక్షల కోసం ప్రీపేర్ అయ్యేవారికి మాత్రమే ఈ ఫీజు పెంపు వర్తిస్తుందని హెచ్‌ఆర్డీ క్లారిటీ ఇచ్చింది. 

మాస్టర్స్ ప్రోగ్రామ్ లో కూడా ఫీజులు పెంచి బీటెక్ కోర్సుల స్థాయికి  తీసుకురావాలనే ప్రతిపాదనకు ఐఐటీ కౌన్సిల్ నేతృత్వంలోని కేంద్ర HRD మంత్రి రామేశ్ పొక్రియాల్ నిషాంక్ ఆమోదం తెలిపారు. ఐఐటీల్లో ఎంటెక్ ప్రొగ్రామ్ లో సంస్కరణలపై ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఐఐటీల్లో చేరడం ఒక్కో విద్యార్థికి ఆర్థికంగా భారంగా మారడంతో ఎంటెక్ కోర్సుల్లో ఫీజులను చాలా ఏళ్ల నుంచి సవరించలేదు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ ఇక ఏ విద్యార్థి ఐఐటీల్లో చదివే అవకాశాన్ని వదులుకోడు అని మినిస్టరీ అభిప్రాయపడింది.