FACT Recruitment 2025: ఏపీ, తెలంగాణలో జాబ్స్.. ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ లేదు.. జస్ట్ మీ మార్క్స్ షీట్ చూసి ఉద్యోగం.. కానీ ఓ కండిషన్
FACT Recruitment 2025: ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (FACT) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

FACT has released a notification for clerk posts.
ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (FACT) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్థిర-కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 7వ తేదీతో ముగియనుంది. కాబట్టి, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ https://fact.co.in/home/Dynamicpages?MenuId=90 ద్వారా దరకాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా లాంటి ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో 50% శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాల కోర్సుల నుండి డిగ్రీలు పొందిన అభ్యర్థులు అర్హులు కాదు. SC, ST, PwBD వర్గాల అభ్యర్థులకు 40% మార్కుల శాతం ఉంటె సరిపోతుంది.
వయోపరిమితి:
అభ్యర్థుల గరిష్ట వయస్సు 26 సంవత్సరాలకు మించకూడదు. 01.07.1999, 30.06.2007 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC (నాన్-క్రీమీ లేయర్) వారికి 3 సంవత్సరాలు, బెంచ్‌మార్క్ వైకల్యాలున్న వారికి10 సంవత్సరాలు, మాజీ సైనికులకు భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సడలింపు ఉంటుంది.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 జీతం అందుతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులకు ఎలాంటి వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం వారి విద్యా రికార్డులు, వయస్సు ఆధారంగా నిర్ణయించబడిన మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.