భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC)లో అసిస్టెంట్ కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 275 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
ఇంజనీరింగ్(ఎలక్ట్రాకల్, మెకానిక్, ఎలక్ట్రానిక్స్,ఇన్ స్ట్రుమెంటేషన్) – 250
అసిస్టెంట్ కెమిస్ట్రీ – 25
విద్యార్హత : అభ్యర్దులు 60 శాతం మార్కులతో బీటెక్, ఎంఎస్సీ కెమిస్ట్రీ లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్దులకు కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసీ, EWS అభ్యర్దులు రూ.150 చెల్లించాలి. SC,ST,దివ్యాంగులు అభ్యర్దులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపికా విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్టు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జూలై 15, 2020.
దరఖాస్తు చివరి తేదీ : జూలై 31, 2020.