NMMS Application
NMMS Scholarship : పేద విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ స్కీమ్స్ అందిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్-2023 (NMMS) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి ,అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Chandrababu Arrest : రేపు రాత్రి ఇళ్లల్లో లైట్లు ఆర్పివేయాలి అని పిలుపునిచ్చిన టీడీపీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే 2023-24 విద్యాసంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ కేటగిరీకి చెందినవారైతే ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
READ ALSO : ISRO Recruitment : ఇస్రోలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
రాత పరీక్ష ద్వారా స్కాలర్‌షిప్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ NMMS-2023 పేరుతో డిసెంబర్ 10న పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవాలంటే ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ.50 ఫీజు పేమెంట్ చేయాలి. నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు సంవత్సరానికి రూ.12000 స్కాలర్‌షిప్ అందజేస్తారు.
READ ALSO : Protect The Lungs : విషపూరితాల నుండి ఊపిరితిత్తులను కాపాడుకునేందుకు ఉపకరించే పానీయాలు ఇవే !
అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు అక్టోబర్ 13న ముగుస్తుంది. ఆన్‌లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ ఫారమ్, ఎన్‌ఆర్ – NR (రెండు కాపీలు), ఎస్బీఐ ఫీజు రసీదుల ఫ్రింట్ కాపీలను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబరు 16గా నిర్ణయించారు.