Kanthitho Kranthi : ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు వెలిగిద్దాం: టీడీపీ పిలుపు
మోత మోగిద్దాం అంటూ ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేయగా తాజాగా ‘లైట్లు ఆర్పేదాం’అంటూ పిలుపునిచ్చింది టీడీపీ.

Kanthitho Kranthi TDP
TDP Kanthitho Kranthi : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ టీడీపీ నేతలు ఏపీలో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు స్వయంగా ఈ నిరసన కార్యక్రమాల్లోకి దిగారు. మోత మోగిద్దాం అనే పేరుతో కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంట్లో భాగంగా 5 నిమిషాల పాటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణితో పాటు పలువురు కుటుంబ సభ్యులు.. టీడీపీ నేతలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్ని ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేస్తూ మోతమోగించారు.
అటువంటి మనో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీడీపీ. అప్పుడు మోత మోగిద్దాం అంటూ ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేయగా తాజాగా ‘కాంతితో క్రాంతి’ పేరుతో మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది టీడీపీ. దీంట్లో భాగంగా రేపు అంటే శనివారం (అక్టోబర్ 7) రాత్రి 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నిమిషాల పాటు ఇళ్లల్లో లైట్లు ఆర్పేసి.. సెల్ ఫోన్లు, టార్చ్ లైట్లు, లేదా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేయాలని కోరింది. చంద్రబాబును నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్న పాలక వర్గానికి.. రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని చాటి చెప్పడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్ట నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. మనమెందుకు చీకట్లో ఉండాలి అంటూ ప్రశ్నించారు.
Also Read: బ్రాహ్మణి ఢమరుకం మోతతో నిరసన.. లోకేశ్, రామ్మోహన్ నాయుడు, రఘురామ గంటకొట్టి..
కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఆయన ఓ పక్క బెయిల్ కోసం యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు జరుగనున్నాయి. మధ్యాహ్నాం విచారణ జరుగనుంది. మరి చంద్రబాబుకు ఊరట కలుగుతుందా, లేదా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి… దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు గారు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?… pic.twitter.com/v0i6zYT1aP
— Brahmani Nara (@brahmaninara) October 6, 2023