ఫిబ్రవరి 25 నుంచి పీఈ సెట్ దరఖాస్తులు

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్‌కు (పీఈసెట్–2019) ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో జరిగిన సెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్‌ను ఈ నెల 18న కమిటీ జారీ చేస్తారు.ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
పరీక్షలు మే 15 నుంచి నిర్వహించనున్నారు రిజిస్ట్రేషన్ ఫీజును రూ.800గా సెట్ కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు రూ.400 చెల్లించాలని పేర్కొంది.ఈ సమావేశంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.