TG ICET Counselling: టీజీ ఐసెట్ అప్డేట్.. కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు
TG ICET Counselling: తెలంగాణ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 2 విడతల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు అధికారులు.

Telangana ICET 2025 Counseling Schedule Released
తెలంగాణ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 2 విడతల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఆగస్ట్ 20వ తేదీతో ప్రారంభం కానుంది. అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ ప్రక్రియ కోసం సిద్ధం అవ్వాలని అధికారులు సూచించారు.
ఐసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలు:
- ఆగస్ట్ 20: ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.
- ఆగస్ట్ 22 నుంచి 29 వరకు: ధ్రువపత్రాల పరిశీలన.
- ఆగస్ట్ 25 నుంచి 30 వరకు: వెబ్ ఆప్షన్ల ఎంపిక.
- ఆగస్ట్ 30: వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్
- సెప్టెంబర్ 2 లోపు: సీట్ల కేటాయింపు జరుగుతుంది.
- సెప్టెంబ్ర 2 నుంచి 5 వరకు: వెబ్ సైట్ ద్వారా రిపోర్టింగ్.
ఐసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలు:
- సెప్టెంబర్ 8: ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు
- సెప్టెంబర్ 9: ధ్రువపత్రాల పరిశీలన
- సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు: వెబ్ ఆప్షన్ల ఎంపిక.
- సెప్టెంబర్ 10: వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్.
- సెప్టెంబర్ 13: సీట్ల కేటాయింపు
- సెప్టెంబర్ 13 నుచి 15: వెబ్ సైట్ ద్వారా రిపోర్టింగ్.
- సెప్టెంబర్ 15 నుంచి 16: కాలేజీల్లో రిపోర్టింగ్.
- సెప్టెంబర్ 15: స్పాట్ అడ్మిషన్లు.