Panchayat Raj Department : తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో 529 ఖాళీ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి సన్నాహకాలు చేస్తున్నారు. ఆర్థిక శాఖ ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖకు 529 పోస్టులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులను వివిధ జిల్లాలకు విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Panchayat Raj Department : తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో 529 ఖాళీ పోస్టులు

Panchayat Raj Department

Updated On : September 10, 2022 / 9:32 PM IST

Panchayat Raj Department : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి సన్నాహకాలు చేస్తున్నారు. ఆర్థిక శాఖ ఇటీవలే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖకు 529 పోస్టులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులను వివిధ జిల్లాలకు విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా పరిషత్తు (జెడ్పీ), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో (డీపీవో) వివిధ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో జెడ్పీ సూపరిటెండెంట్‌ పోస్టులు 103, జెడ్పీ సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 151, జెడ్పీ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 213 ఉన్నాయి.

NABARD Vacant Posts : నాబార్డ్‌లో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్ ఖాళీ పోస్టులు భర్తీ

వీటితోపాటు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 22, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 40 మంజూరు అయ్యాయి. వీటిలో కొన్నింటిని నేరుగా, మరి కొన్నింటిని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.

అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 34, సంగారెడ్డి, నిర్మల్‌, నాగర్‌కర్నూల్‌, మెదక్‌ జిల్లాలకు 27 పోస్టుల చొప్పున మంజూరయ్యాయి. ఈ ఖాళీ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు.