National Apprenticeship Mela
PMNA MELA : తెలంగాణా ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా(ITI) సంస్థ సెప్టెంబర్ 11వ తేదీన ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళ నిర్వహించనుంది. ఈ మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ స్కిల్ ఇండియా మిషన్ కింద ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా ని నిర్వహిస్తోంది. అందులో బాగంగా వివిధ రంగాలకు చెందిన వివిధ కంపెనీలు భాగస్వాములవుతుండటంతో ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అప్రెంటిస్‌లను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది.
READ ALSO : Rice Cultivation : వరిలో ఎరువుల యాజమాన్యం
ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళ సెప్టెంబర్ 11 ఉదయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ పాతబస్తీ హైదరాబాద్ లో మేళా ఉంటుంది. ఈ మేళాలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐటీఐ/ఇంటర్/డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్రెంటిషిప్ మేళాకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది.
READ ALSO : Dhanush : ఆ అమ్మాయి వల్లే జీవితం నాశనం.. మరోసారి వైరల్‌గా మారిన ధనుష్ వ్యాఖ్యలు
పూర్తిస్ధాయి బయోడేటా ఫామ్ తో పాటుగా మీ సర్టిఫికెట్ జిరాక్సు , ఒరిజినల్ సర్టిఫికెట్లతో గవర్నమెంట్ ఐఐటీ, ఓల్డ్ సిటీ హైదరాబాద్, చిరునామాకు హాజరుకావాల్సి ఉంటుంది. ముందుగా అభ్యర్థులు గుగూల్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్ సైట్ లింక్ ; https://forms.gle/ceatLQXyu2Z5nWp6 ఈ మేళాకు సంబంధించి పూర్తి వివరాల కొరకు 040-24461815 సంప్రదించాల్సి ఉంటుంది. ఇతర సమాచారం కోసం వెబ్ సైట్ ; www.apprenticeshipindia.gov.in పరిశీలించగలరు.