Rice Cultivation : వరిలో ఎరువుల యాజమాన్యం

ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలుకు చాలా వరకు వరినారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. 

Rice Cultivation : వరిలో ఎరువుల యాజమాన్యం

Rice Cultivation

Rice Cultivation : రుతుపవనాలు ఆలస్యంగా పలకరించాయి. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా వరిసాగు అవుతుందనుకుంటున్న సమయంలో అకాల వర్షాలు తీవ్రనష్టం కలిగించాయి. వర్షాలు తగ్గాకా ఇప్పుడిప్పుడే నార్లు వేసే పనిలో రైతులు ఉన్నారు. అయితే వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే ప్రాంతానికి, రకాలకు అనుగుణంగా సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్యాన్ని రైతులు తప్పనిసరిగా పాటించాలి. మరిన్ని వివరాలను మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్ ద్వారా తెలుసుకుందాం.

READ ALSO : Consumer Court: ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువ వచ్చిందని పంచాయితీ.. రూ. లక్ష జరిమానా విధించిన కోర్టు

ఖరీఫ్ వరిసాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు దీర్ఘకాలిక రకాల నాట్లు పూర్తి కావచ్చాయి. మరికొన్ని ప్రాంతాల్లో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో నారుమడి దశనుండి నాట్లు వేసే దశలో ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వరిపైర్లు వివిధ దశలో ఉన్నాయి.

READ ALSO : Clay Pot Accident On Gas Stove : మట్టికుండలో వంట చేస్తుండగా ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

అయితే ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలుకు చాలా వరకు వరినారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి.  ముఖ్యంగా నాట్లు మొదలు.. దశనుబట్టి  సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ.. తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా ,బెల్లంపల్లి , కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్.

READ ALSO : Rat Damage Control in Paddy : వరిలో ఎలుకలను నివారించే పద్ధతులు

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లోని వరిపైరులో సూక్ష్మధాతు లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవి ఏర్పడితే.. పైరు ఎదుగుదల లోపిస్తుంది. దీన్ని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. రైతులు యూరియాను అధిక మోతాదులో వేస్తుంటారు. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులను సమపాళ్లలో వేసుంటే, పెట్టుబడులు తగ్గడమే కాకుండా, చీడపీడల బెదడ ఉండదు. తద్వారా అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుంది.