Consumer Court: ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువ వచ్చిందని పంచాయితీ.. రూ. లక్ష జరిమానా విధించిన కోర్టు

బిస్కెట్ తయారీ సంస్థ రోజుకు సుమారు 50లక్షల బిస్కెట్లు తయారు చేస్తొంది. ఒక్కో బిస్కెట్ ఖరీదు రూ. 75పైసలు. ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తగ్గించడం వల్ల రోజుకు రూ. 29లక్షల మోసానికి సంస్థ పాల్పడుతుందని

Consumer Court: ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువ వచ్చిందని పంచాయితీ.. రూ. లక్ష జరిమానా విధించిన కోర్టు

Biscuit

Chennai based consumer: తమిళనాడులో వింత ఘటన చోటు చేసుకుంది. తాను కొనుగోలు చేసిన బిస్కెట్ ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తక్కువగా ఉండటంతో కొనుగోలుదారుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్యాకెట్‌లో 16 బిస్కెట్లు ఉండాల్సి ఉండగా.. కేవలం 15 బిస్కెట్లు మాత్రమే రావడంతో తమిళనాడులోని వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు. వ్యక్తి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కోర్టు సదరు బిస్కెట్ కంపెనీ సంస్థకు రూ. లక్ష జరిమానా విధించింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై మణలి సమీపంలోని మాత్తూరు ఎంఎండీఏకి చెందిన ఢిల్లీ బాబు అనే వ్యక్తి 2021 డిసెంబర్ నెలలో సన్‌ఫీస్ట్ మేరీలైట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేశాడు. అందులో 16 బిస్కెట్లు ఉండాల్సి ఉంది. కానీ, 15 మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని దుకాణదారుడు, బిస్కెట్ తయారీ సంస్థ ఐటీసీకి తెలియజేయగా స్పందన రాలేదు.

Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?

ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ మాత్రమేగా తక్కువగా వచ్చింది.. దాని వల్ల ఇబ్బంది ఏమిటంటూ సంస్థ సిబ్బంది దబాయించడంతో ఢిల్లీబాబుకు కోపం వచ్చింది. ఎలాగైనా వీరికి బుద్ధిచెప్పాలని అనుకున్నాడు. దీంతో తిరువళ్లూరులోని వినియోగదారుల కోర్టులో కేసు దాఖలు చేశాడు. తన ఫిర్యాదులో.. బిస్కెట్ తయారీ సంస్థ రోజుకు సుమారు 50లక్షల బిస్కెట్లు తయారు చేస్తొంది. ఒక్కో బిస్కెట్ ఖరీదు రూ. 75పైసలు. ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ తగ్గించడం వల్ల రోజుకు రూ. 29లక్షల మోసానికి సంస్థ పాల్పడుతుందని కోర్టుకు నివేదించాడు. ఎఫ్ఎంసీజీ కంపెనీ, బిస్కెట్ ప్యాకెట్‌ను విక్రయించిన దుకాణం నుంచి రూ. 100 కోట్ల జరిమానా విధించాలని ఢిల్లీ బాబు తన ఫిర్యాదులో కోరాడు. అన్యాయమైన వాణిజ్య, సేవా లోపానికి పాల్పడినందుకు పరిహారంగా మరో రూ.10కోట్లు డిమాడ్ చేశాడు.

Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. నడకమార్గంలో చిరుతను బోనులో బంధించిన అధికారులు

అయితే, బిస్కెట్ తయారీ సంస్థ మాత్రం.. ప్యాకెట్‌లో బిస్కెట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టును కోరింది. కానీ, కోర్టు ఢిల్లీ బాబు వాదనలను పరిగణలోకి తీసుకుంది. ఢిల్లీ బాబుకు రూ. లక్ష జరిమానా చెల్లించాలని ఐటీసీ సంస్థకు వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వ్యాజ్యానికి అయ్యే ఖర్చులకు రూ. 10వేలు ఇవ్వాలని వినియోగదారుల ఫోరం బిస్కెట్ తయారీ కంపెనీని ఆదేశించింది.