CDFD JOBS : సీడీఎఫ్ డీలో ప్రాజెక్ట్ స్టాఫ్ భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి డీఎంఎల్‌టీ, బీఎస్సీ,డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ,ఎండీ,ఎంఎస్‌ ఉత్తీర్ణత. సీఎ్‌స్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌, గేట్‌ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

CDFD JOBS : సీడీఎఫ్ డీలో ప్రాజెక్ట్ స్టాఫ్ భర్తీ

Cdfd

Updated On : June 2, 2022 / 10:44 AM IST

CDFD JOBS : భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌(సీడీఎఫ్‌డీ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి టెక్నికల్‌ అసోసియేట్స్‌, ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌, కంప్యూటేషనల్‌ ల్యాబొరేటరీ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో తదితర పోస్టులు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి డీఎంఎల్‌టీ, బీఎస్సీ,డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ,ఎండీ,ఎంఎస్‌ ఉత్తీర్ణత. సీఎ్‌స్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌, గేట్‌ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీగా జూన్‌ 20, 2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.cdfd.org.in/ పరిశీలించగలరు.