ITBP Recruitment 2023
ITBP Recruitment 2023 : భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)లో స్పోర్ట్స్ కోటా2023 కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 248 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
READ ALSO : AISSEE 2024 : అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024).. దరఖాస్తుకు తుదిగడువు ఇదే !
ఖాళీల వివరాలు:
కానిస్టేబుల్[జనరల్ డ్యూటీ) గ్రూవ్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్): 218 ఖాళీలు ఉన్నాయి.
క్రీడాంశాలు:
అభ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్టియన్, స్పోర్ట్స్ షూటింగ్, బాక్సింగ్, పుట్‌బాల్ జిమ్నాస్టిక్స్ హాకీ వెయిట్ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ రెజ్లింగ్, ఆర్బరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్ తదితర క్రీడల్లో ప్రతిభకలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
READ ALSO : Iceland High Alert : ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వత విస్ఫోటన ముప్పు…హై అలర్ట్ జారీ
అర్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి.
వయోపరిమితి:
21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం :
నెలకు రూ.21,00-రూ.69100.
READ ALSO : Guvvala Balaraju : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి
పరీక్ష ఫీజు ;
జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యుఎస్ రూ 100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు ;
ఆన్ లైన్ దరఖాస్తులు 13-11-2023 నుండి ప్రారంభమవుతాయి.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి గడువు తేది 28-11-2023గా నిర్ణయించారు.
పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ ; www.recruitment.itbpolice.nic.in