Iceland High Alert : ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వత విస్ఫోటన ముప్పు…హై అలర్ట్‌ జారీ

ఐస్‌లాండ్‌ దేశంలో ఆదివారం హైఅలర్ట్ ప్రకటించారు. ఐస్‌లాండ్‌ దేశంలోని రెక్జాన్స్ ప్రాంతంలో అగ్నిపర్వత విస్పోటనం జరగవచ్చని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.....

Iceland High Alert : ఐస్‌లాండ్‌లో అగ్నిపర్వత విస్ఫోటన ముప్పు…హై అలర్ట్‌ జారీ

Iceland High Alert

Updated On : November 12, 2023 / 11:03 AM IST

Iceland High Alert : ఐస్‌లాండ్‌ దేశంలో ఆదివారం హైఅలర్ట్ ప్రకటించారు. ఐస్‌లాండ్‌ దేశంలోని రెక్జాన్స్ ప్రాంతంలో అగ్నిపర్వత విస్పోటనం జరగవచ్చని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. రాబోయే అగ్నిపర్వత విస్పోటన ముప్పు కారణంగా ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్నిపర్వత వ్యవస్థకు సమీపంలో ఉన్న గ్రిండావిక్‌లో మూడు వేల మంది నివాసితులను ఖాళీ చేయించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ALSO READ : Hamas commander : గాజా ఆసుపత్రిలో వెయ్యిమందిని బందీలుగా ఉంచిన హమాస్ కమాండర్ హతం…ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడి

ఐస్‌లాండ్‌ దేశంలో గత 48 గంటల్లో 1485 భూకంపాలు సంభవించాయి. ఐస్‌లాండ్‌ లో అగ్నిపర్వత విస్పోటనం జరిగే అవకాశం ఉన్నందున యూకే విదేశాంగశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాజాగా హెచ్చరిక జారీ చేసింది. కానీ కెఫ్లావిక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను మాత్రం నిషేధించ లేదు.

ALSO READ : Cricket World Cup 2023: సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు బెంగళూరులో టీం ఇండియా దీపావళి వేడుకలు

మిడ్-అట్లాంటిక్ రిడ్జ్‌లో ఉన్న ఐస్ లాండ్ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలకు కేంద్రంగా ఉంది. శిలాద్రవం సొరంగం నుంచి విస్ఫోటనం సంభవించే అవకాశం ఉందని ప్రొఫెసర్ పాల్ ఎనార్సన్ హెచ్చరించారు. అగ్నిపర్వత విస్పోటనం ఎప్పుడైనా జరగవచ్చని యూనివర్శిటీ ఆఫ్ ఐస్‌ల్యాండ్‌కు చెందిన ప్రొఫెసర్ థోర్వాల్‌దుర్ థోర్డార్సన్ పేర్కొన్నారు.