Hamas commander : గాజా ఆసుపత్రిలో వెయ్యిమందిని బందీలుగా ఉంచిన హమాస్ కమాండర్ హతం…ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడి
ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడిలో హమాస్ కమాండర్ అహ్మద్ సియామ్ హతం అయ్యాడు. గాజా ఆసుపత్రిలో 1000మంది గాజావాసులను బందీలుగా ఉంచిన నాజర్ రద్వాన్ కంపెనీ కమాండరును హతమార్చినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.....

Gaza hospital
Hamas commander : ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడిలో హమాస్ కమాండర్ అహ్మద్ సియామ్ హతం అయ్యాడు. గాజా ఆసుపత్రిలో 1000మంది గాజావాసులను బందీలుగా ఉంచిన నాజర్ రద్వాన్ కంపెనీ కమాండరును హతమార్చినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. సియామ్‌తో పాటు ఇతర ఉగ్రవాదులు అల్ బురాక్ స్కూల్‌లో దాక్కున్నారని పేర్కొంది. బందీలను దక్షిణ గాజాకు సురక్షితంగా తరలిస్తామని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
ALSO READ : Manish Sisodia : భార్యను కౌగిలించుకున్న మనీష్ సిసోడియా…చిత్రాన్ని పంచుకున్న సీఎం కేజ్రీవాల్
హమాస్‌కు చెందిన నాజర్ రద్వాన్ కంపెనీ కమాండర్ అహ్మద్ సియామ్ ఉగ్రవాద దాడుల్లో పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకున్నాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఈ మేర ఐడీఎఫ్ ఎక్స్ లో పోస్టు చేసింది. గతనెల 7 వతేదీన పాలస్థీనా ఇజ్రాయెల్ దేశంపై దాడి చేసింది. అనంతరం ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు హమాస్ కమాండర్లు మరణించారు. యుద్ధంలో ఇజ్రాయెల్‌లో 1,200 మంది మరణించగా, గాజాలో 11,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ALSO READ : Cricket World Cup 2023: సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు బెంగళూరులో టీం ఇండియా దీపావళి వేడుకలు
పాఠశాల వద్ద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 25 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిలో ఆక్సిజన్, విద్యుత్, ఇంధనం లేనందువల్ల రోగులకు ముప్పు పొంచి ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రి మై అల్ కైలా చెప్పారు. ఇజ్రాయెల్ దళాలు ఆసుపత్రి వైద్య సిబ్బందిని వెళ్లిపోవాలని బెదిరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఆసుపత్రిపై వైమానిక దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. ఆసుపత్రిలో 39 మంది శిశువులు ప్రమాదంలో ఉన్నారని, ఒక శిశువు మరణించిందని పాలస్తీనా ఆరోగ్య మంత్రి అల్ కైలా తెలిపారు.